ఉద్యోగాల కోసం సీపీఎం పోరుబాట.. సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట ధర్నా!

కలం, మెదక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం సంగారెడ్డి (CPM Sangareddy) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి. సాగర్ మాట్లాడుతూ.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, కానీ ఆ హామీని నెరవేర్చడంలో తీవ్రంగా విఫలమైందని విమర్శించారు.

అదేవిధంగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తోందని రేవంత్ రెడ్డి సర్కార్‌పై మండిపడ్డారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. స్థానికులకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ అధికారులకు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>