ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండ (Yenugonda) పరిధిలోని ఏడో డివిజన్ శ్రీ చంద్ర కాలనీ పార్కులో ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి కార్పొరేటర్ కుర్వ మంజుల శ్రీశైలం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల శ్రీశైలం మాట్లాడుతూ.. శ్రీ చంద్ర కాలనీ, రామకృష్ణ కాలనీ, అక్షర వీధి సగర కాలనీల ప్రజలు ఆలయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలనీల ప్రజల విజ్ఞప్తి మేరకు పార్కు స్థలంలో ఆలయ నిర్మాణంతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. పార్కు స్థలంలో సొంత ఖర్చులతో కార్పొరేటర్ హైమాస్ లైట్లు, బోరును వేయించారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నారాయణ, బుస్సా కృష్ణారెడ్డి, కిషన్, కిషన్ దాస్, దశరథం, పవన్ కుమార్, వెంకట రాములు, రాజేందర్, రాజేష్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస చారి, శ్రీనివాసులు, సత్తయ్య, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్, చక్రవర్తి గౌడ్, సుదర్శన్, జిల్లా కురువ సంఘం అధ్యక్షులు సుదా నర్సింలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>