దళారుల ప్రమేయం పథకాల అమలు: మంత్రి శ్రీహరి

కలం, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలోని పేదలకు దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 229 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.89లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

రోడ్డు నిర్మాణ పనులకు…

పట్టణంలోని మూడో వార్డులో రూ.2.50 కోట్లతో కేశవ నగర్, చెన్నకేశవ నగర్ నుంచి దండు బీటి రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. గుట్కూరు మండల పరిధిలోని ముఖ్య నాయకులు కార్యకర్తలతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి సతీమణి వాకిటి లలిత, బి‌కే‌ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ జి.బాలకృష్ణ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాకిటి మానస, వైస్ ఛైర్‌పర్సన్ శైవి రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>