పల్నాడు జిల్లాలో విషాదం.. నలుగురి మృతి

కలం, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నరసరావుపేట (Narasaraopeta) మండలంలోని పలు గ్రామాల్లో పిడుగులు పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేకల వెంకాయ్య ఇంటి సమీపంలో పిడుగు పడి మరణించారు. పాలపాడు గ్రామానికి చెందిన డేరంగుల వెంకటయ్య, యక్కలవారిపాలెంకు చెందిన చిన్న కోటేశ్వర రావు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా.. పిడుగు పాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. పెట్లూరివారి పాలెంలో తల్లపునేని నాగమ్మ ఇంటి కొబ్బరి చెట్టుపై పిడుగు పడగా, ఆ శబ్ధానికి గుండెపోటుకు గురై మరణించారు.

సీఎం చంద్రబాబు సంతాపం..

పల్నాడు జిల్లాలో పిడుగుపాటుతో నలుగురు వ్యక్తులు మరణించడంపై సీఎం చంద్రబాబు సంతాపం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వినాయక చవితికి ఒక్క రోజు ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. సంతోషంగా గడపాల్సిన నాలుగు కుటుంబాల్లో విషాదం నెలకొనడంపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>