మామడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ భర్త మృతి!

కలం, మామడ : మామడ (Mamada Road Accident ) మండలం రాయదారి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ భర్త గుమ్ముల నవీన్ (35) మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామానికి చెందిన నవీన్ భార్య మామడ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు పోలీస్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. బుధవారం నవీన్ తన కుమారులను ద్విచక్ర వాహనంపై నిర్మల్ పట్టణంలోని హాస్టల్‌లో వదిలి తిరిగి మామడకు వస్తుండగా రాయదారి గ్రామ సమీపంలో ఎన్ హెచ్ 61 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం అతని బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>