విషాదం.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

కలం, హనుమకొండ: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి (Constable Died) చెందిన ఘటన హనుమకొండ (Hanumakonda) జిల్లాలో జరిగింది. స్థానికుల ప్రకారం.. కాజీపేట డీజిల్ కాలనీకి చెందిన డోలి విజయకుమార్ (40) వరంగల్ జిల్లా దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున భట్టుపల్లి శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>