డిప్యూటీ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు.. గవర్నర్​ కు ఫిర్యాదు!

కలం, వెబ్ డెస్క్​ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని (Nandini Bhatti)పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కోసం ఆమె కమీషన్ డిమాండ్ చేశారని పేర్కొంటూ అడ్వకేట్, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

కమీషన్ డిమాండ్‌పై ఆరోపణలు..

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత ఎస్.కే. ప్రసన్నకుమారి చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ ఫిర్యాదు దాఖలైంది. రూ.40 లక్షల రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలకు 10 శాతం కమీషన్‌గా రూ.4 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. మెడికల్ అండ్ హెల్త్ శాఖలో సుమారు రూ.120 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి క్లియరెన్స్ కోసం 6 నుంచి 10 శాతం వరకు కమీషన్లు అడుగుతున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాలు లేదా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఖండన గానీ, స్పందన గానీ రాలేదు.

ఈ అంశంపై వెంటనే కేసు నమోదు చేసి స్వతంత్ర, కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని రేవంత్ కోరారు. ప్రసన్నకుమారి, ఇతర రిటైర్డ్ ఉద్యోగుల వాంగ్మూలాలను సేకరించాలని, పెండింగ్ బిల్లుల ఫైళ్ల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదు ప్రతులను ఏసీబీ, లోకాయుక్త, సీఎస్, డీజీపీ, సీఎమ్ గ్రీవెన్స్ సెల్‌కు పంపినట్లు వెల్లడించారు.

Also Read : వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>