ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవ

కలం, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అభివృద్ధికి కలెక్టర్ రాజర్షి షా(Rajarshi Shah) ప్రత్యేక చొరవ తీసుకొని రూ.5 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ ఆవరణలో కలెక్టర్ రాజర్షి షా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. పాత్రికేయుల సంక్షేమం, ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>