విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్

కలం, మెదక్ బ్యూరో : విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ (Medak) జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh) పేర్కొన్నారు. అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని ఆమె అన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రారంభమైన సంక్షేమ వారోత్సవాల సందర్భంగా, మొదటి రోజు మెదక్ జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల కిచెన్, మధ్యాహ్న భోజన పథకం అమలు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల పరిస్థితిని కలెక్టర్ (Collector Pratima Singh) పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం శుభ్రంగా, రుచికరంగా ఉండేలా చూడాలని సూచించారు. వంటకు ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరుకులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అలాగే పాఠశాల పరిసరాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆమె తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా పాఠశాలల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.

Read Also: మేడిగడ్డను సందర్శించిన సీఎం రేవంత్.. క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>