కలం, ఖమ్మం బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం (Khammam) జిల్లా పర్యటనకు నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి 18వ తేదీన సీఎం పర్యటన సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనపై అధికారిక సమాచారం, మినెట్ టు మినెట్ షేడ్యూల్ వచ్చే లోపు అవసరమైన సన్నద్ధత ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జనవరి 18న ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లి హెలిప్యాడ్ లో ల్యాండ్ అయి జెఎన్టియు కళాశాల భవన నిర్మాణానికి, మున్నేరు నుండి పాలేరు (Munneru – Paleru) లింక్ కెనాల్ కు శంకుస్థాపనలు, నూతన మార్కెట్ యార్డు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, కూసుమంచి 100 పడకల ఏరియా ఆసుపత్రి ప్రారంభోత్సవ పైలాన్ ల ఆవిష్కరణ, అనంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని, ఖమ్మం (Khammam) పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
విధులు నిర్వహించే అధికారులకు ప్రత్యేకమైన ఐడి కార్డులు అందించాలని, మీడియాతో సమన్వయం చేసుకుంటూ మంచి కవరేజ్ వచ్చే విధంగా చూడాలని ఇంచార్జి కలెక్టర్ శ్రీజ (Collector Sreeja) తెలిపారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి బ్రీఫ్ నోట్స్ శాఖల వారిగా అధికారులు తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: గాదె ఇన్నయ్యకు బెయిల్ మంజూరు
Follow Us On: Youtube


