కలం, నిర్మల్: జిల్లాలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను (SIR Process) పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) తెలిపారు. బుధవారం సాయంత్రం నిర్మల్ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, తిరస్కరణకు గల ప్రధాన కారణాలను వివరించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అందిస్తున్న సహకారం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లువెంకట మాధవ రావు, రాథోడ్ రమేష్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

