హరీశ్ రావుకు ఇక చుక్కలే: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: సిద్ధిపేటలో ఇక ముందు హరీశ్ రావుకు చుక్కలు చూపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. మీడియా సమావేశం తరువాత చిట్ చాట్ చేశారు. కేసీఆర్‌కు కామారెడ్డిలో చుక్కలు చూపించామన్నారు. హరీశ్ రావును ఎల్లమ్మ గుడి దగ్గరకు పోయి ప్రమాణం చేయమని తాను సవాల్ చేస్తే.. అక్కడకు వెళ్లి సదరు ఉత్సవాల్లో డ్యాన్స్ చేశారని ఎద్దేవా చేశారు. రాజగోపాల్ రెడ్డిని ఒక్కసారి వదిలేద్దామని తాను అనలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీఎం చేసిన తాజా కామెంట్స్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చివరిసారిగా వదిలేద్దామని ఆదివారం ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ అన్నట్లు చర్చ జరిగింది. తాను అలా అనలేదని ముఖ్యమంత్రి క్లారిటీ ఇవ్వడంతో.. వారిద్దరిపై హై కమాండ్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనే చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>