కలం, వలిగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ ఆధ్వర్యంలో ‘హ్యామ్’ (Hybrid Annuity Model – HAM) విధానంలో చేపడుతున్న రహదారి అభివృద్ధి పనులకు ఈనెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా చిట్యాల నుండి రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా జగదేవ్‌పూర్ వరకు సుమారు రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కనెక్టివిటీ రోడ్డు పనులు పూర్తి అయినట్లయితే, ట్రాఫిక్ సమస్యలు తగ్గి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనదారుల ప్రయాణం మరింత సులభతరం కానుంది.

