epaper
Wednesday, February 18, 2026
epaper

ఆ మూడు కేసులు సీబీఐకి ఇస్తామన్న సీఎం రేవంత్

కలం, డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ మీద బీజేపీ అబద్దాలు చెబుతోందన్నారు. ‘గతంలో జెన్ కోకు కేసీఆరే బకాయిలు పెట్టాడు. కానీ అప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అడిగే దమ్ము లేకుండా పోయింది. నేను అమాయకుడిని కాబట్టే నన్ను తిడుతున్నారు. కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి. కాళేశ్వరంపై 48 గంటల్లో సీబీఐ విచారణ జరిపిస్తామని చెప్పాడు. ఇప్పటి దాకా ఎందుకు చేయట్లేదు. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేసి అందరి ఫోన్లు విన్నారు. ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ ఆధారంగానే ఇతరుల విచారణ జరుపుతున్నాం. పైనున్న వాళ్లు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రభాకర్ రావు చెప్పారు. ఫార్ములా ఈ కేసుతో పాటు ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ అక్రమాలను సీబీఐకి అప్పగిస్తాం’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

తమ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) అస్సలు చేయట్లేదని.. ఇతరుల ఫోన్లు వినడం మానసిక క్షోభకు గురి చేస్తుందని సీఎం రేవంత్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా జరుగుతోందని.. అందులో తాను జోక్యం చేసుకోవట్లేదని సీఎం రేవంత్ వెల్లడించారు. ఫార్ములా ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని.. అయినా సరే ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తాను కక్షపూరిత రాజకీయాలు చేయబోనని.. తనకు ఎవరి మీద కోపం లేదని సీఎం వెల్లడించారు. రీసెంట్ గా చనిపోయిన బీజేపీ కౌన్సిలర్ మృతిపై కిషన్ రెడ్డి (Kishan Reddy) కోరితే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ (Revanth Reddy).

Read Also: చట్టసభల్లో సభ్యులకు భద్రత ఎంత? మోదీకి సైతం ముప్పు?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>