కలం, వరంగల్ బ్యూరో: అసియాలోని అతిపెద్ద మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటిస్తున్నారు. సోమవారం ఉదయం సీఎం రేవంత్‌కు గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో ఆదివాసీలు స్వాగతం పలికారు. అనంతరం ఆధునీకరించిన మేడారం (Medaram) గద్దెలను ప్రారంభించారు. సమ్మక్క దేవత గద్దె వద్ద కుటుంబసమేతంగా పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్బంగా తులాభారంపై తన మనుమడితో కలిసి సీఎం కూర్చుని అమ్మవారికి 68 కిలోల బెల్లం సమర్పించారు. గద్దెల ప్రాంగణంలో సీఎం కుటుంబ సభ్యులకు, మంత్రులకు మంత్రి సీతక్క దేవతల ప్రసాదం, చీరె సారె బహుకరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
తొలి మొక్కులు సమర్పించడంతో సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన పూర్తైంది. హెలికాప్టర్లో ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా సీఎం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు.


