స్వచ్ఛమైన గానుగ నూనె ఆరోగ్యానికి మేలు: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్ : రసాయనాలు లేకుండా పురాతన పద్ధతిలో ఎద్దుల గానుగ ద్వారా తీసే స్వచ్ఛమైన నూనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector Rajarshi Shah) అన్నారు. శుక్రవారం తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో తోట రాణి – శ్రీధర్ దంపతులు ఏర్పాటు చేసిన ‘నిధి నేచురల్ ఫార్మింగ్’ ఎద్దు గానుగ నూనె తయారీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, ప్రాసెసింగ్ విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోనే తొలిసారిగా సంప్రదాయ పద్ధతిలో స్వచ్ఛమైన నూనె ఉత్పత్తిని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ప్రజారోగ్యానికి దోహదపడే ఇలాంటి సహజసిద్ధ యూనిట్లకు ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, సబ్సిడీతో కూడిన రుణాలు సైతం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి రవీందర్ సింగ్, తహసిల్దార్ రాజ్ మోహన్, ఎంపిడిఓ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>