Mobile Popup Ad
Mobile Popup Ad

మెట్రో రైల్ నిర్మాణంలో కేసీఆర్ నిర్లక్ష్యం: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఏర్పడ్డాక అప్పటి సీఎం కేసీఆర్ వేగవంతం చేయాల్సిన హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro) నిర్మాణాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్ (CM Revanth) ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేశారని.. ఢిల్లీ మెట్రోను ఆదర్శంగా తీసుకొని హైదరాబాద్ మెట్రోను ఏర్పాటు చేశారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్లు ఆలస్యం చేయడంతో రూ.7 వేల కోట్ల అంచనాలు పెరిగేలా చేశారని అన్నారు. ఒకప్పుడు ఢిల్లీ, హైదరాబాద్ మెట్రోలు మొదటి స్థానంలో ఉండేవని చెప్పారు.

సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని సీఎం రేవంత్ అన్నారు. 122 కిలోమీటర్లు మెట్రోను విస్తరించాలని కోరితే ఎల్ అండ్ టీ (L&T) కంపెనీ తిరస్కరించిందని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ మెట్రోతోనే తమకు నష్టాలు వస్తున్నాయని ఎల్ అండ్ టీ సంస్థ చెప్పిందని అన్నారు. ఏటా రూ.400 కోట్లకు పైగా నష్టం వస్తోందని ఆ సంస్థ చెబుతోందన్నారు. ఎన్ని విధాలుగా చెప్పినా సెకండ్ ఫేజ్ లో భాగస్వామ్యం కాబోమని తేల్చిచెప్పిందని వివరించారు. ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను కొంటేనే సమస్య తీరుతుందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. యూపీ మెట్రో ఎండీ సుశీల్ కుమార్ ను కేంద్రం కొనుగోలు సభ్యుడిగా చేసిందని చెప్పారు. రూ.30 వేల కోట్ల మెట్రోను రూ.15 వేల కోట్లకుకొనుగోలు చేశామని తెలిపారు. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్ కు రూ.350 కోట్ల నిర్మాణ ఖర్చు అవుతోందని వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>