నేడు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

కలం, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లాలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. కలిదిండిలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం కైకలూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు.

సీఎం టూర్‌కి సంబంధించి అధికారిక పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సోమవారం ఉదయం 10:45 గంటలకి కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు హెలికాప్టర్‌లో సీఎం చేరుకుంటారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఉదయం 11 గంటలకు కలిదిండి ఎమ్మార్వో ఆఫీసుకు చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు. ఆ తర్వాత కలిదిండిలో ప్రజా వేదిక వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించనున్నారు. ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 2:05 వరకు ప్రజా వేదిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

మధ్యాహ్నం 2:55 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పార్టీ శ్రేణులతో సీఎం సమావేశమవుతారు. 2:55 నుంచి సాయంత్రం 4:25 గంటల వరకు క్యాడర్ సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4:35 గంటలకు కలిదిండి ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్‌కు చేరుకొని సభలో ప్రసంగిస్తారు. అనంతరం 4:40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4:55 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>