కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఢిల్లీ పర్యటనకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. చంద్రబాబు ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలీకాప్టర్‌లో హైదరాబాద్ కు బయల్దేరారు. అక్కడి నుంచి చంద్రబాబు ఢిల్లీకి పయనం అవుతారు.
కాగా, ఢిల్లీలో కేంద్రమంత్రి కుమారస్వామితో కలిసి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ ఆహ్వానంతో సీఎం ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో ఆయన (CM Chandrababu) కు పిలుపు అందింది. సాయంత్రం ఎన్డీఏ పక్ష నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

