పారిశుధ్య కార్మికురాలిపై దాడిని ఖండిస్తూ సీఐటీయూ నిరసన ర్యాలీ

కలం, ఖానాపూర్: నల్గొండ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న పారిశుధ్య కార్మికురాలు అరుణమ్మపై జరిగిన దాడిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ (CITU Protest) నిర్వహించారు. అనంతరం పోలీసులకు వినతిపత్రం అందజేసి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులకు విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని, బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుంచుల నారాయణ, జావిద్, గంగాధర్, శంకరమ్మ, అమీర్, నరేష్, రవి, నాగరాజ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>