‘చెరువుగట్టు’ బాధితులకు ఎమ్మెల్యే భరోసా.. తక్షణ సహాయం పంపిణీ!

కలం, నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు (Cheruvugattu) పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 20కి పైగా దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (MLA Vemula Veeresham) హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, బాధితులతో నేరుగా మాట్లాడి జరిగిన ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పొట్టకూటి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేద వ్యాపారులు సర్వస్వం కోల్పోవడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తోడ్పాటుగా ఎమ్మెల్యే వీరేశం (Vemula Veeresham) తనవంతుగా నష్టపోయిన ఒక్కో దుకాణదారునికి రూ. 20 వేల చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ప్రభుత్వ పరంగా బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండటానికి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ చర్యలను మరింత బలోపేతం చేయాలని, గుట్ట కింద ఉన్న విద్యుత్ లైన్లు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలకు ఆస్కారం ఉన్న వైరింగ్‌ను పూర్తిగా పరిశీలించి, తక్షణమే అవసరమైన మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Read Also: ఇస్నాపూర్‌లో నలుగురు స్కూల్ గర్ల్స్ మిస్సింగ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>