చండూరులో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

కలం, మునుగోడు (చండూరు): రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని నల్గొండ జిల్లా చండూరు (Chandur) కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాచార సాంకేతిక రంగం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి రాజీవ్ చేసిన కృషి దేశ ప్రగతికి బాటలు వేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, రాజీవ్ గాంధీ ఆశయాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ భూతరాజు దశరథ, చండూరు మాజీ సర్పంచి కోడి గిరిబాబు, కోడి వెంకన్న, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు అయిత రాజు మల్లేష్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పోలే వెంకటరెడ్డి, రుషిపాక వాసు, చండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయలు, సీనియర్ నాయకులు బుర్కల ఎలక్షన్, సోము లింగస్వామి, పడసబోయిన యాదయ్య, కట్ట భిక్షం, ఇర్గి రాజు, చొప్పరి రాజు, బొమ్మరబోని సైదులు, మాజీ సర్పంచి సాపిడి రాములు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>