పేదల పథకాలను కొనసాగించాలి: బీఆర్‌ఎస్

కలం, నిర్మల్: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం లోకేశ్వరం (Lokeshwaram) మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన(BRS Protest) చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తున్నాయని అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలను రద్దు చేసే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

అర్హులైన లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న ఆర్థిక సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే పథకాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో  బీఆర్‌ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చిన్నారావు, సర్పంచ్ వెంకటేష్, మాజీ సర్పంచ్ దిగంబర్, ఉప సర్పంచ్ కడారి రాజు, సోషల్ మీడియా మండల కన్వీనర్ బండి ప్రశాంత్, నాయకులు అనిల్, పాల గంగాధర్, ప్రభాకర్ రావు, సంజీవ్, చిన్న బోజారెడ్డి, సందీప్, ప్రకాష్, రాజన్న, రాజు, ప్రవీణ్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>