కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో సిమ్ల వాడకంపై కేంద్రం కొత్త నిబంధనలు (New SIM Rules) తీసుకొచ్చింది. ఒక వ్యక్తి అన్ని టెలికాం కంపెనీలు, సర్వీస్ ఏరియాలు కలిపి గరిష్ఠంగా 9 మొబైల్ కనెక్షన్లు మాత్రమే తీసుకునేలా DoT నిబంధనలు (DoT) నిబంధనలు విధించింది. జమ్మూకశ్మీర్, అసోం, ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం గరిష్ఠ పరిమితి 6 మొబైల్ కనెక్షన్లు మాత్రమేనని స్పష్టం చేసింది. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ (DIP) ద్వారా గుర్తించిన అనుమానాస్పద నంబర్లకు రీ-వెరిఫికేషన్ చేయాలని పేర్కొంది. పరిమితికి మించి కొత్త కనెక్షన్లు జారీ కాకుండా కఠినమైన వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది. సైబర్ మోసాలు, అక్రమ కార్యకలాపాలకు మొబైల్ నంబర్ల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యమని కేంద్రం స్పష్టం చేసింది.

