కలం, స్పోర్ట్స్ : తొలి సెట్‌లో తడబడ్డాడు. ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చాడు. కానీ కీలక సమయంలో పుంజుకున్నాడు. వరల్డ్ నంబర్-3 కార్లోస్ అల్‌కరాజ్ (Carlos Alcaraz) జపాన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. స్పెయిన్‌కే చెందిన జౌమ్ మునార్‌తో జరిగిన సెమీఫైనల్లో 5-7, 6-3, 6-1తో విజయం సాధించాడు. టోక్యోలోని అరియాకే కొలీజియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆరంభంలో అల్‌కరాజ్ ఆధిపత్యం ప్రదర్శించాడు. 5-3తో ముందంజలో నిలిచాడు. తొలి సెట్‌ను సొంతం చేసుకునేందుకు సర్వీస్ కూడా చేశాడు. కానీ ఆ అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. మునార్ వరుసగా పుంజుకుని తొలి సెట్‌ను 7-5తో గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో అల్‌కరాజ్ ఆటతీరు మార్చాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ ఆధిక్యం సాధించాడు.
కీలక గేముల్లో పైచేయి సాధించి 6-3తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో అల్‌కరాజ్‌ను ఆపడం మునార్‌కు సాధ్యం కాలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ 4-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరకు 6-1తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో అల్‌కరాజ్ (Carlos Alcaraz) వరుసగా రెండోసారి జపాన్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు. గత ఏడాది కూడా ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇప్పుడు టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాడు. ఫైనల్లో జిరి లెహెచ్కా లేదా వాలెంటిన్ వాషెరోట్‌తో తలపడనున్నాడు.

