కలం, నల్లగొండ బ్యూరో : చౌటుప్పల్ (Choutuppal) మున్సిపాలిటీలో హైడ్రామా కొనసాగుతోంది. బీ-ఫామ్ తీసుకునే టైమ్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని మహేశ్వరి ఇచ్చిన ట్విస్ట్ నియోజకవర్గంలో చర్చకు దారితీసింది. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరపున 17వ వార్డు అభ్యర్థిగా చింతల ఉమామహేశ్వరి బీ ఫామ్ అందుకున్నారు. అయితే అంతకుముందే కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తిని ఆ పార్టీ నేతలు విత్‌డ్రా చేయించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ వార్డులో అభ్యర్థి లేకుండా పోయారు. దీంతో తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీస్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


