కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో కోతులు శనివారం బీభత్సం సృష్టించాయి. కాలనీలోని గంగారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇంట్లోకి చొరబడిన కోతులు ఇంట్లోని వస్తువులను చిందరవందర చేస్తూ హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో గంగారెడ్డిపై దాడి చేయడంతో ఆయన రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి.
కోతుల దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇంద్రసేనారెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి ఒక్కసారిగా కోతులు చొరబడటంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కోతుల దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి వాటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

