ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు: ఎంపీ చామల

కలం, భువనగిరి : అమెరికాలోని డల్లాస్‌లో ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నేటి భారతదేశం సాంకేతికత, ఆర్థిక స్థిరత్వం, ఆవిష్కరణల్లో ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందిందని కొనియాడారు. డిజిటల్ పరివర్తన నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు 21వ శతాబ్దంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోందన్నారు.

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు దేశానికి గర్వకారణమని, గ్లోబల్ వేదికపై భారత్‌కు వారే నిజమైన బ్రాండ్ అంబాసిడర్లని పేర్కొన్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు, భారతీయులు మన సంస్కృతీ సంప్రదాయాలను చాటుతూ వ్యాపార, సాంకేతిక రంగాల్లో రాణించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్, టెక్సాస్ స్టేట్ ప్రతినిధి మాట్ షాహీన్, ఫ్రిస్కో మేయర్ మార్క్ హిల్, రిచర్డ్‌సన్ మేయర్ అమీర్ ఒమర్, ఆర్లింగ్టన్ మేయర్ జిమ్ రాస్, డల్లాస్ కౌంటీ కమిషనర్ ఆండ్రూ సోమర్‌మన్‌లతో పాటు పలువురు ఎన్‌ఆర్‌ఐ ప్రముఖులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>