Mobile Popup Ad
Mobile Popup Ad

బ్లాక్ బడ్జెట్.. డ్రీమ్ బడ్జెట్.. ఏమిటవీ..!

కలం, తెలంగాణ బ్యూరో: ఇందిరా గాంధీ హయాంలో 1973లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ‘బ్లాక్ బడ్జెట్ ’ (Black Budget)గా పిలుస్తుంటారు. ఇండియా, పాకిస్తాన్ వార్ కారణంగా అప్పటి ప్రభుత్వం ఆదాయానికి మించి ఖర్చులు చేసింది. పైగా అప్పట్లో వచ్చిన కరువు వల్ల కూడా ఖర్చులు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ఆదాయం తగ్గిపోయింది. నాడు రెవెన్యూ లోటు ఏకంగా రూ.550 కోట్లుగా తేలింది. ఆ కాలంలో ఇది చాలా ఎక్కువ!! ఆర్థిక సంక్షోభం సమయంలో పెట్టినందున దీన్ని ‘బ్లాక్ బడ్జెట్ ’గా వ్యాపార వర్గాలు పిలుస్తుంటాయి. ఈ బడ్జెట్ ను నాటి ఆర్థిక మంత్రి యశ్వంత్ రావ్ బీ. చవాన్ ప్రజెటెంట్ చేశారు. దీని మొత్తం రూ. 11,838 కోట్లు.

డ్రీమ్ బడ్జెట్ కథ ఇదీ..!

1997 బడ్జెట్ ను ‘డ్రీమ్ బడ్జెట్ (Dream Budget)’ గా సంబోధిస్తుంటారు. అప్పుడు దేవేగౌడ ప్రధాన మంత్రిగా, పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అటు వ్యాపారవేత్తలకు, ఇటు సామాన్యులకు ఇన్ కమ్ ట్యాక్స్ రేట్లలో, స్లాబ్స్ లో భారీగా ఊరటనిచ్చారు. గరిష్ట ఆదాయ పన్ను రేటును 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడం.. దానికి తోడు కార్పొరేట్ పన్నునూ తగ్గించడం.. ఆర్థిక సంస్కరణ కోసం పలు అంశాలు ముందట పెట్టడంతో.. దీన్ని ‘డ్రీమ్ బడ్జెట్ ’ గా చెప్తుంటారు. దీని మొత్తం రూ.2,32176 కోట్లు.

Read Also: కేంద్ర బడ్జెట్ : ఆసక్తికర విశేషాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>