కలం, నిర్మల్: జిల్లా కేంద్రంలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా (BJP Yuva Morcha) ఆధ్వర్యంలో బుధవారం ‘ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడం మానుకుని పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజీ నరేశ్, కూన శశాంక్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, బీజేపీ నాయకులు సాదం అరవింద్, జంగం వీరేశ్, జమాల్, జుట్టు దినేశ్, ఇర్ల విజయ్, శ్రీకాంత్ రెడ్డి, కందుల హరీశ్, భరత్ పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ సాగునీటి రంగానికి ఊరట.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Follow Us On: Sharechat

