‘SIR’పై విపక్షాల దుష్ప్రచారానికి కౌంటర్‌.. బీజేపీ మహా పాదయాత్రకు సన్నాహాలు!

కలం, నిర్మల్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా బీజేపీ (BJP) సమరశంఖం పూరిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌ 3న నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలో మహా పాదయాత్ర (Maha Padayatra) నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. నిర్మల్‌, ముధోల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల నుంచి సుమారు 50 వేల మందిని సమీకరించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో ఈ కార్యక్రమంపై పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి బుధవారం హెలిప్యాడ్‌ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. ముఖ్య అతిథి రాక, పాదయాత్ర నిర్వహణ, జనసమీకరణతోపాటు ఇతర ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొనేలా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఎస్‌ఐఆర్‌పై విపక్షాల ప్రచారానికి దీటుగా సమాధానం ఇచ్చేలా మహా పాదయాత్రను నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్‌, కౌన్సిలర్లు గంజి రాజు, శ్రీరామోజు నరేష్‌, జింక సురేందర్‌, కూన శశాంక్‌, మాజీ కౌన్సిలర్లు బిట్లింగ్‌ నవీన్‌, ఎడిపెల్లి నరేందర్‌, నాయకులు జమాల్‌, సాదం అరవింద్‌, ఈశ్వర్‌, కందుల హరీష్‌, భరత్‌, స్వాప్నిక్‌, నేరేళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>