బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా గురుదీప్‌ సింగ్‌

కలం, నిర్మల్‌: బీజేపీ మైనార్టీ మోర్చా (BJP Minority Morcha) నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడిగా నిర్మల్‌ పట్టణానికి చెందిన సర్దార్‌ గురుదీప్‌ సింగ్‌ నియమితులయ్యారు. శనివారం పార్టీ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించింది. జిల్లా మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులుగా అబ్దుల్‌ నహీం, ప్రతాప్‌ సింగ్‌, షేక్‌ గౌస్‌, బద్ద ప్రతాప్‌ సింగ్‌ నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా రజాక్‌ హైమద్‌, రుస్తుం, కార్యదర్శులుగా బద్ద అత్తర్‌ సింగ్‌, షరీఫ్‌, అల్తాఫ్‌, గోరెమియా, కోశాధికారిగా రసూల్‌, మీడియా కన్వీనర్‌గా ఖుర్షీద్‌ ఖాన్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా షేక్‌ మునీర్‌ను నియమించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డికి సర్దార్‌ గురుదీప్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>