కలం, ఖమ్మం బ్యూరో: గణేశ్ నిమజ్జనం వేళ డీజేలు వాడినా, మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని భద్రాచలం డీఎస్పీ (Bhadrachalam DSP) అరుణ్ కుమార్ హెచ్చరించారు. గోదావరి వద్ద నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శనివారం నిమజ్జన ఘాట్లను పరిశీలించిన డీఎస్పీ, ఊరేగింపుల్లో డీజేలు, క్రాకర్స్ వాడకంపై పూర్తి నిషేధం విధించినట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే సహించేది లేదన్నారు. గోదావరి వద్ద ప్రమాదాలు జరగకుండా SDRF, DDRF రక్షణ బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. భక్తులు, ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలని కోరారు.

