విదేశీ రాజకీయ ప్రతినిధి వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరపాలి : బీజేపీ

కలం, నిర్మల్ : హైదరాబాద్‌లో ఈ నెల 14న నిర్వహించిన భారత్ సమ్మిట్‌ – 2026లో (Bharat Summit 2026) విదేశీ రాజకీయ ప్రతినిధి జియాకోమో ఫిలిబెక్ (Giacomo Filibeck) చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నాయకులు (BJP Leaders) డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను (SP Janaki Sharmila) కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. పార్టీ ఆఫ్ యూరోపియన్ సోషలిస్ట్స్ సెక్రటరీ జనరల్‌గా ఉన్న జియాకోమో ఫిలిబెక్ భారత పర్యటనలో భాగంగా బహిరంగ వేదికపై ఓట్ చోర్.. గద్దె ఛోడ్ అనే రాజకీయ నినాదాన్ని ప్రస్తావించడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆయన ఏ కేటగిరీ వీసాపై భారత్‌కు వచ్చారని, వీసా నిబంధనలకు అనుగుణంగానే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారా? ఇందుకు సంబంధిత అనుమతులు పొందారా అనే అంశాలపై విచారణ జరపాలని ఫిర్యాదులో కోరారు. అలాగే భారత్ సమ్మిట్‌ – 2026 నిర్వాహకులు, స్పాన్సర్లు, సమన్వయకర్తల పాత్రపైన విచారణ చేపట్టాలని కోరారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్‌ – 2025 నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు గంజి రాజు, కూన శశాంక్, శ్రీరామోజు నరేష్, రావులవార్ విఠల్, జిల్లా మీడియా కన్వీనర్ బుర్ర రమేష్ గౌడ్, నాయకులు రాంనాథ్, కుమ్మరి వెంకటేష్, ఒడిసెల అర్జున్, కందుల హరీష్, ధర్మాజీగారి ఈశ్వర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>