బండి సంజయ్‌ను కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం

కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశం (Sayini Mallesham) మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాయిని మల్లేశంని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు

జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని బండి సంజయ్ సూచించారు . ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, కర్రే పద్మ అనిల్, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, గుంజేటి శివ, గాధగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>