ఖమ్మం-కొత్తగూడెం సరిహద్దులో మెరుపు తనిఖీలు.. డ్రైవర్లకు షాక్

​కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో ఖమ్మం-కొత్తగూడెం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. డీఎస్పీ ఆదినారాయణ పర్యవేక్షణలో సుజాతనగర్ (Sujathanagar) మండల పరిధిలోని గరీబ్‌పేట గ్రామంలో శనివారం కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు ‘కార్డన్ సెర్చ్’ నిర్వహించారు. ​సుమారు 120 మంది పోలీస్ సిబ్బందితో గ్రామాన్ని నలుమూలలా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

సరైన ధ్రువపత్రాలు లేని 68 ద్విచక్ర వాహనాలు, 19 త్రిచక్ర వాహనాలతో సహా మొత్తం 87 వాహనాలను గుర్తించిన పోలీసులు చట్టప్రకారం జరిమానాలు విధించారు. గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 30 ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆదినారాయణ గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఎన్‌డీపీఎస్ చట్టం కింద ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ ఆపరేషన్‌లో సీఐలు యాసీన్, వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, శ్రీలక్ష్మితోపాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>