సైబర్ నేరాల కట్టడిలో ‘భద్రాద్రి’ భేష్.. రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్!

​కలం, ఖమ్మం బ్యూరో: సైబర్ నేరాలను అరికట్టడంలో టెక్నాలజీని సమర్థవంతంగా వాడినందుకుగాను భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పోలీస్ శాఖ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచి భేష్ అనిపించుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించే ఎంఆర్ఎమ్, జీఆర్ఎమ్, సమన్వయ, సహాయోగ్ లాంటి పోర్టల్స్‌ను వినియోగించడంలో సత్తా చాట్టింది. దీని ఆధారంగా ప్రకటించిన ‘సమన్వయ’ కేటగిరీలో జిల్లాకు రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. ఈ ఘనత సాధించడం పట్ల జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హర్షం వ్యక్తం చేశారు. గురువారం ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బంది సమిష్టి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సైబర్ బాధితులకు వేగవంతంగా న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, యువతలో చైతన్యం తెచ్చేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘స్పార్క్ క్లబ్’ ద్వారా అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రియదర్శిని డిగ్రీ కళాశాల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారి ద్వారా డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ట్రాప్‌ల పట్ల తోటి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

సైబర్ చైతన్యంలో భాగస్వాములవుతున్న విద్యార్థులను ఎస్పీ అభినందించారు. ప్రతిఒక్కరూ తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ జితేందర్, ఎస్సై జుబేదా బేగం, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>