భద్రాచలంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, 21న శ్రీరామ పట్టాభిషేకం!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రీరామ లీలా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో కొలువుదీరిన లక్ష్మీ అమ్మవారు అక్టోబర్ 12 నుంచి 21 వరకు రోజూ ఓ ప్రత్యేక అలంకారంలో భక్తులకు ఇస్తున్నారు. మారుతి సదనం వేదికగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో అష్టలక్ష్మి అలంకార దర్శనాలతోపాటు, ప్రతిరోజూ మధ్యాహ్నం కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

​ఉత్సవాల ముగింపు వేడుకలైన అక్టోబర్ 21న శ్రీ రామ మహా పట్టాభిషేకోత్సవం నేత్రపర్వంగా జరగనుంది. అదే రోజు సాయంత్రం దసరా మండపం వద్ద శమీపూజ (విజయోత్సవం) రావణ దహన కార్యక్రమాలు జరగనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కుంకుమార్చన, నవరాత్రి వేడుకల్లో పాల్గొనాలని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. దామోదరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>