Mobile Popup Ad
Mobile Popup Ad

ఖాళీ కడుపుతో కొబ్బరినీళ్లు తాగితే శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

కలం, వెబ్‌డెస్క్: వేసవి కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా శరీరానికి తక్షణ శక్తిని, చలవను ఇచ్చే అద్భుతమైన ప్రకృతి ప్రసాదం కొబ్బరినీళ్లు (Coconut Water). చాలామంది కొబ్బరినీళ్లను రోజులో ఎప్పుడో ఒకప్పుడు తాగుతుంటారు. అయితే, వీటన్నింటికంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడానికి బదులు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్షణాల్లో అలసట మాయం

రాత్రి 7 నుండి 8 గంటల నిద్ర తర్వాత మన శరీరం సహజంగానే నిర్జలీకరణానికి గురవుతుందట. అందుకే ఉదయం లేవగానే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అందులోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. బాడీని త్వరగా రీహైడ్రేట్ చేసి, ఉదయం పూట వచ్చే అలసట, తలతిరగడం వంటి సమస్యలను దూరం చేస్తాయని సూచిస్తున్నారు నిపుణులు.

గ్యాస్, ఎసిడిటీకి శాశ్వత పరిష్కారం

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుందట. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ శరీర మెటబాలిజాన్ని పెంచి, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నీరు సహజంగా క్షార గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఉదయాన్నే వేధించే గుండెమంట, ఎసిడిటీ సమస్యలను ఇది త్వరగా అదుపులోకి తెస్తుందని చెబుతున్నారు.

బరువు తగ్గడడం

బరువు తగ్గాలనుకునేవారికి కొబ్బరి నీరు ఒక అద్భుతమైన హెల్తీ డ్రింక్. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. ఉదయాన్నే దీన్ని తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల ఎక్కువ ఆహారం తీసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారికి ఇది ఎంతగానో సహాయపడుతుందరి చెబుతున్నారు నిపుణులు.

సహజమైన మెరుపు

చర్మ సౌందర్యానికి కూడా కొబ్బరి నీరు ఉపయోగపడుతుందట. కొబ్బరి నీరు చర్మాన్ని లోపలి నుండి పోషిస్తుంది. ఇందులో ఉండే సైటోకైనిన్లు చర్మ కణాలు త్వరగా వృద్ధాప్య ఛాయల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిరోజూ పరగడుపున కొబ్బరి నీరు తాగడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుందట. చర్మానికి సహజమైన గ్లో రావడంతో పాటు యవ్వనంగా కనిపించేలా చేస్తుందంటున్నారు నిపుణులు.

బాడీ డిటాక్సిఫికేషన్

కొబ్బరి నీరు శరీరంలో ఒక మంచి క్లెన్సర్‌లా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన హానికరమైన టాక్సిన్స్ మూత్రం ద్వారా బయటకు పంపడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా కొబ్బరి నీరు ఎంతో మేలు చేస్తుందట. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీలతో రోజును ప్రారంభించి లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే.. ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లతో ఆరోగ్యకరమైన జీవనశైలికి శ్రీకారం చుట్టడం ఎంతో ఉత్తమమని సూచిస్తున్నారు నిపుణులు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>