Mobile Popup Ad
Mobile Popup Ad

వందేళ్ల భవిష్యత్తుకు ‘తెలంగాణ రైజింగ్ – 2047’ : సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రం మొత్తానికి ఒకటే మాస్టర్ ప్లాన్ రూపొందించడం దేశంలోనే ఎక్కడా లేదని, ఈ సరికొత్త ఆలోచనకు తెలంగాణనే నాంది పలికిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే వందేళ్ల పాటు రాష్ట్ర గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించేలా ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ బృహత్తర ప్రణాళిక తెలంగాణను దేశంలోనే కాకుండా, ప్రపంచానికే ఒక గొప్ప గేట్‌వేగా నిలబెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ఆ తర్వాత 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల మహా ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించిందని సీఎం స్పష్టం చేశారు.

ఈ ప్రతిష్టాత్మక లక్ష్య సాధన కోసం రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు విభాగాలుగా వర్గీకరిస్తూ మూడంచెల అభివృద్ధి వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని ‘క్యూర్’ (CURE) గా పరిగణించి, దీనిని ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్‌గా మార్చబోతున్నారు. ఈ క్రమంలోనే పాలనా సౌలభ్యం కోసం ఇప్పటివరకు ఉన్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించినట్లు పేర్కొన్నారు. అలాగే భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరితో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లుగా మెట్రోపాలిటన్ పోలీస్ వ్యవస్థను విస్తరించామని చెప్పారు.

మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని పూర్తి పర్యావరణహితంగా, కాలుష్య రహితంగా మార్చడమే ఈ సరికొత్త ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు అవతలికి తరలించేలా హిల్ట్ (HILT) పాలసీని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందుకోసమే ఈవీ వాహనాలకు లైఫ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులతో పాటు రోడ్డు టాక్స్ నుండి పూర్తి మినహాయింపులు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>