కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ సిద్ధాంతకర్త.. జాతిని జాగృతం చేసిన యోధుడు.. స్వరాష్ట్రమే శ్వాసగా జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అని బీసీ సమాజ్ (BC Samaj) నాయకులు కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ కాలనీలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మహోపాధ్యాయుడనీ చీకట్లు కమ్మిన తెలంగాణలో ప్రత్యేక ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసి ఆసమానతల సమైక్య రాష్ట్రం నుంచి తెలంగాణకు న్యాయం కోసం కొట్లాడిన గొంతుకని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ గౌరవ అధ్యక్షుడు శివార్చక విజయ కుమార్, బీసీ సమాజ్ (BC Samaj) పార్టీ ప్రధాన కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్, బీసీ జాక్ రాష్ట్ర నాయకులు సారంగి లక్ష్మీకాంత్, నాయకులు లక్ష్మి నారాయణ పాల్గొన్నారు.
Also Read : భారత్కు మరో మైలురాయి.. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష సక్సెస్
Follow Us On : WhatsApp

