epaper
Monday, January 19, 2026
spot_img
epaper

పాక్‌తో టీ20 సిరీస్‌ ఆడే ఆస్ట్రేలియా టీమ్ ఇదే

కలం, స్పోర్ట్స్:  టీ20 ప్రపంచ కప్‌కు ముందు పాకిస్థాన్‌తో టీ20 సిరీస్ ఆడటానికి ఆస్ట్రేలియా రెడీ అయింది. తాజాగా పాక్‌తో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. బీబీఎల్‌ 2025–26 సీజన్‌లో అదరగొట్టిన మహ్లీ బీర్డ్‌మన్, జాక్ ఎడ్వర్డ్స్‌కు జట్టులో చోటు దక్కింది. పెర్త్ స్కార్చర్స్ తరఫున బీర్డ్‌మన్ ఆకట్టుకున్నాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున ఎడ్వర్డ్స్ నిలకడగా రాణించాడు. ఈ ప్రదర్శనతో ఇద్దరూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. బీర్డ్‌మన్ ఇప్పటికే భారత్‌తో టీ20 సిరీస్‌లో ఆడాడు. ఎడ్వర్డ్స్ గతంలో వన్డే గ్రూప్‌లో భాగమయ్యాడు.

బీబీఎల్ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్, నాథన్ ఎలిస్‌లకు విశ్రాంతి ఇచ్చారు. గాయాల కారణంగా టిమ్ డేవిడ్, జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. షాన్ అబాట్, బెన్ ద్వార్షుయిస్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మ్యాట్ రెన్షాను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. ప్రపంచకప్‌కు ముందు ఈ సిరీస్ కీలకమని సెలెక్టర్లు భావిస్తున్నారు. యువ ఆటగాళ్లకు ఇది మంచి అవకాశం. ఎంపిక అంచున ఉన్నవారికి తమ ప్రతిభ చూపించే వేదిక. లాహోర్‌లో జనవరి 29, 31 మరియు ఫిబ్రవరి 1న మూడు టీ20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫిబ్రవరి 11న కొలంబోలో ఐర్లాండ్‌తో ఆస్ట్రేలియా ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది.

ఆస్ట్రేలియా జట్టు

మిచెల్ మార్ష్ (కెప్టెన్), షాన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, మహ్లీ బీర్డ్‌మన్, కూపర్ కానోలీ, బెన్ ద్వార్షుయిస్, జాక్ ఎడ్వర్డ్స్, క్యామరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మ్యాథ్యూ కుహ్నెమాన్, మిచ్ ఓవెన్, జోష్ ఫిలిప్, మ్యాథ్యూ రెన్షా, మ్యాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపా.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>