ఆదివాసీ యువతి శిరీష కుటుంబానికి ఎమ్మెల్యే చేయూత

కలం, చంద్రుగొండ : కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే (Aswaraopeta MLA)  జారె ఆదినారాయణ ప్రజాప్రతినిధిగానే కాకుండా, ఆ ఇంటి పెద్దకొడుకుగా కొండంత అండగా నిలిచారు. హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్సుగా సేవలందిస్తూ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీష దశదిన కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించారు.

​బాధిత కుటుంబానికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ, శిరీష సోదరుడికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాన్ని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అందజేశారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం, ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించిన ఆయన, కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ అండగా నిలుస్తున్నారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిరీష మరణం సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పేరు, జ్ఞాపకాలు ఈ ప్రాంతంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా గ్రామస్తులకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను శిరీష పేరు మీదే చేపడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆదివాసీ ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొని శిరీషకు నివాళులర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>