వెంకటేశ్వరుడి స్వర్ణోత్సవ వేడుకలకు చినజీయర్‌ స్వామి!

కలం, వనపర్తి: వనపర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవ వేడుకలకు త్రిదండి చినజీయర్‌ స్వామి హాజరుకానున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్న స్వర్ణోత్సవ మహోత్సవాలకు హాజరుకావాలని ఆలయ ధర్మకర్త రఘునాథాచార్యులు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కలిసి చినజీయర్‌ స్వామిని ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన స్వామీజీ సానుకూలంగా స్పందించి, ఆయా తేదీల్లో వనపర్తికి విచ్చేస్తానని హామీ ఇచ్చారు.

ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆలయ ఆధ్యాత్మిక ప్రస్థానానికి గుర్తుగా స్వర్ణోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తిశ్రద్ధలతో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన సతీమణి శారదారెడ్డి, కుమారుడు నవనీత్‌రెడ్డితో కలిసి చినజీయర్‌ స్వామికి ఆహ్వానం పలికారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, మార్కెట్‌ యార్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఎస్‌ఎల్‌ఎన్‌ రమేష్‌, తిరుమల మహేష్‌, వికాస తరంగిణి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>