హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ (Amberpet) తిరుమలనగర్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నిభాష్ (25) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వైఫల్యమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల మనస్తాపానికి గురైన నిభాష్ ఒత్తిడికి లోనై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకునే ముందు నిభాష్ తన స్నేహితులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో వారు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>