గ్రామాల విలీనం: ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం, ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని (AP Government)కి నోటీసులు జారీ చేసింది.

విలీన ప్రక్రియలో చట్టపరమైన నిబంధనలను పాటించలేదని, సంబంధిత గ్రామ పంచాయతీల ఆమోదం గానీ, తీర్మానాలు గానీ లేకుండా ఏకపక్షంగా మున్సిపాలిటీల్లో కలిపేశారని పిటిషనర్లు తమ పిటిషన్లలో ఆరోపించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా చేపట్టిన ఈ విలీన చర్యలు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విచారణ సందర్భంగా విలీన ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం అనేది తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>