ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వైసీపీ ఆందోళనలు..!

కలం, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ (AP Assembly) వర్షాకాల సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 4 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. సభ ముందుకు మెగా డీఎస్సీ సహా 6 కీలక బిల్లులను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే డీఎస్సీపై మంత్రి నారా లోకేష్ సభలో పవన్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ప్రస్తుతం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యింది. సభలో ప్రజా సమస్యలు, వివిధ శాఖల సమర్థతపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు జవాబు ఇస్తున్నారు. నేడు లంచ్ బ్రేక్ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ ( బీఏసీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, సమావేశాల్లో ఏయే ముఖ్యమైన అంశాలపై చర్చించాలనే విషయాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకుంటారు.

మరోవైపు సభ ప్రారంభమైన కాసేపటికే ఏపీ శాసనమండలి వాయిదా పడింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయని.. డీఎస్సీపై చర్చించాలని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనలు చేశారు. దీంతో కూటమి , వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో శాసనమండలిని చెర్మన్ వాయిదా వేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>