కలం, వెబ్ డెస్క్ : కాకినాడ (Kakinada) జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు వంతెనపై నుంచి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు (61)తో పాటు ఆయన భార్య మీనా(59), కుమార్తె సౌజన్య (34) గల్లంతయ్యారు.
గోదావరిలోకి దూకిన నూకరాజు మనవడికి ఈత రావడంతో ప్రాణాలు దక్కాయి. ఈదుతున్న నూకరాజు మనవడిని మత్స్యకారులు గుర్తించి కాపాడారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం నూకరాజు, మీనా, సౌజన్య కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

