వందేమాతరం వివాదం: సోనియాపై అమిత్ షా ఫైర్!

కలం, వెబ్ డెస్క్​ : వందేమాతరం గేయం ఆలపిస్తున్న సమయంలో జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని చిత్తౌర్‌గఢ్‌ వేదికగా జరిగిన సభలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) వైఖరిని ఖండించారు.

ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా వందేమాతరం గేయం ప్రారంభమైనప్పుడు, ఆ పాటను మధ్యలోనే ఆపేయాలని సోనియా గాంధీ తమ పార్టీ అధ్యక్షుడికి సూచించారని అమిత్ షా (Amit Shah) ఆరోపించారు. ఈ దృశ్యాలను దేశప్రజలంతా టీవీల్లో ప్రత్యక్షంగా చూశారని ఆయన పేర్కొన్నారు.

వందేమాతరం గేయాన్ని మధ్యలోనే నిలిపివేయాలని అనుకోవడం క్షమించరాని నేరమని అమిత్ షా వ్యాఖ్యానించారు. 140 కోట్ల భారత ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని, దేశప్రజలు ఈ చర్యను ఎప్పటికీ క్షమించరని ఆయన స్పష్టం చేశారు. జాతీయ గేయాన్ని అసమగ్రంగా వదిలేయాలని కాంగ్రెస్ నాయకులు ఎలా ఆలోచిస్తారని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ శ్రేణులు సిగ్గుపడాలని ఆయన విమర్శించారు.

Also Read : కేసీఆర్ కుటుంబంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>