కలం, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సరికొత్తగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిన్న అర్ధరాత్రి విడుదలైన ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో డ్రాగన్ (Dragon) అఫీషియల్ గ్లింప్స్‌ను ప్రస్తావిస్తూ బన్నీ ఈ ఆసక్తికర ట్వీట్ చేశారు. “హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ.. ఈ పుట్టినరోజు నీ జీవితంలో శ్రేయస్సు, శాంతి, ప్రేమని తీసుకురావాలని కోరుకుంటున్నాను. అయితే ఈసారి రాబోయేది టైగర్ కాదు.. డ్రాగన్. ప్రతి షాట్‌లోనూ నిప్పులు చెరుగుతాడు” అంటూ ఎన్టీఆర్ మాస్ ఎలివేషన్‌పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా ‘బావ’ అని పిలుచుకునే ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలుగు ప్రేక్షకుల్లో జోష్‌ను నింపుతోంది.

